News December 4, 2024

క్రేజీ న్యూస్.. పవన్ మూవీకి పార్ట్-2!

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’పై నటి నిధి అగర్వాల్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు పార్ట్-2 త్వరలోనే ఉంటుందని Xలో అభిమానులతో చిట్ చాట్‌లో ఆమె చెప్పారు. ఈ మూవీతో పాటు రాజాసాబ్‌లో తాను చేసే రోల్స్‌ను అభిమానులు ఇష్టపడుతారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పవన్‌ను వర్ణించడానికి ఒక్క మాట సరిపోదని, ఆయనొక లెజెండ్ అని పొగడ్తల వర్షం కురిపించారు.

Similar News

News February 3, 2026

సమీకృత సాగు.. భూమిని బట్టి ఒక్కో విధానం

image

సమీకృత వ్యవసాయంలో ఏ భూములు వేటి పెంపకానికి అనుకూలమో చూద్దాం ☛ బీడుభూములు – పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం, వ్యవసాయ అడవుల పెంపకం, వ్యవసాయ చెరువులకు అనుకూలం. ☛ తోట భూములు – పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం, పుట్టగొడుగులు, తేనె తయారీ, పట్టు పురుగుల పెంపకానికి అనుకూలం. ☛ తడి భూములు – పంటలు, చేపలు, బాతులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువుల పెంపకానికి అనుకూలం.

News February 3, 2026

దేవతా విగ్రహాలు ఏ దిశలో ఉండాలి?

image

ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఉండే పూజా గది ఈశాన్యంలో ఉండడం శుభదాయకం. దేవుడి విగ్రహాలను తూర్పు దిశలో అమర్చాలి. అంటే ఆ విగ్రహాలు పశ్చిమ దిశను చూస్తున్నట్లుగా ఉండాలి. ఇలా ఉంచడం వల్ల మనం పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చుంటాము. ఇది ఏకాగ్రతను పెంచి ఇంట్లో ప్రశాంతతను, సానుకూల శక్తిని చేకూరుస్తుంది. ఈ దిశల అమరిక వల్ల దైవ స్వరూపాల నుంచి వచ్చే శక్తి ఇల్లంతా ప్రసరించి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.

News February 3, 2026

FPIల నుంచి భారీగా పెట్టుబడుల ఉపసంహరణ

image

అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరిలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. డెరివేటివ్‌లపై సెక్యూరిటీ ట్రాన్జాక్షన్‌ ట్యాక్స్‌ భారీ పెంపుతో భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ఛాన్సుంది. 2025లో FPIలు రూ.1.66 లక్షల కోట్ల(18.9 బి.డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.