News January 29, 2025
బాలయ్య ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్?

వరస హిట్స్‌తో ఊపుమీదున్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ‘హిట్’ యూనివర్స్‌లో బాలయ్య కూడా భాగమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో నాని నటించిన హిట్-3 విడుదల కానుండగా, అందులో బాలయ్య చిన్న పాత్రలో మెరుస్తారని, కొనసాగింపుగా హిట్-4లో పూర్తిస్థాయి పోలీసుగా కనిపిస్తారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
Similar News
News December 2, 2025
జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.
News December 2, 2025
మళ్లీ వేలంలోకి ‘HR88B8888’.. ఎందుకంటే?

హరియాణాలో ‘HR88B8888’ అనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలంలో రూ.1.17 కోట్లు పలికి దేశవ్యాప్త చర్చకు దారితీసిన <<18396670>>విషయం<<>> తెలిసిందే. ఈ నంబర్‌ను తిరిగి వేలం వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 50,000 కనీస ధరతో ప్రారంభమైన గత ఆన్లైన్ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అయితే ఈ నంబర్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి నిర్ణీత గడువులో డబ్బు చెల్లించలేదు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నారు.
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్‌గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్‌గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు.


