News February 5, 2025
క్రేజీ రికార్డ్.. దూబే జట్టులో ఉంటే భారత్ గెలుపు పక్కా

భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఓ క్రేజీ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. అతను జట్టులో ఉన్న 30 T20లలో IND వరుసగా విజయం సాధించింది. దూబే 2019 నవంబర్ 3న బంగ్లాపై తొలి మ్యాచ్ ఆడగా ఇండియా ఓడిపోయింది. తొలి 5 మ్యాచ్‌లలో జట్టుకు 2 ఓటములు ఎదురయ్యాయి. 2019 డిసెంబర్ 11న విండీస్‌పై గెలుపు నుంచి దూబే టీమ్‌లో ఉన్న ప్రతిసారీ విజయం సొంతమైంది. దీంతో ఇతనిది లక్కీ జాతకమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 13, 2025
స్వస్తివచనం ఎందుకు చేయాలి?

చేయబోయే పనులు విజయవంతం కావాలని, మనతో పాటు చుట్టూ ఉన్న అందరికీ మేలు కలగాలని కోరుతూ పలికే పవిత్ర ప్రార్థననే ‘స్వస్తి వచనం’ అంటారు. సంకల్పంతో కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన పనులకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తే, ఆ సానుకూల శక్తి తిరిగి మనకే బలాన్నిస్తుంది. లక్ష్యాలకు విజయాన్ని చేరుస్తుంది. అందుకే ఏ కార్యాన్ని మొదలుపెట్టినా స్వస్తివచనం తప్పక ఆచరించాలి.
News November 13, 2025
ప్రెగ్నెన్సీలో జామపండ్లు తినొచ్చా?

జామపండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని తినడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అలాగే శిశువులో నాడీలోపాలు రాకుండా, తల్లిలో యాంగ్జైటీ రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
News November 13, 2025
మార్నింగ్ అప్డేట్స్

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం


