News May 15, 2024

‘దేవర’ నుంచి క్రేజీ అప్‌డేట్

image

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ ‘దేవ‌ర‌’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఒకరోజు ముందే 19న FearSongను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. FearSong మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న మాస్ పోస్టర్‌ను జత చేశారు.

Similar News

News February 3, 2026

మా సహనమే గెలిపించింది: మోదీ

image

తమ సహనానికి ఫలితమే అమెరికాతో వాణిజ్య ఒప్పందమని PM మోదీ అన్నారు. ‘టారిఫ్స్‌ను కొందరు విమర్శించారు. కానీ మేం ఓపికగా ఉన్నాం. ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని NDA పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు. ప్రపంచ క్రమం మారుతోందని, ఇండియా వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా ఇండియా ప్రయోజనం పొందుతోందని తెలిపారు. అంతకుముందు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వీట్ చేశారు.

News February 3, 2026

అలాగైతే ఇండియా నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం

image

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మా దేశ ప్రైవసీపై మీరు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాలో ఒక్క అక్షరం/అంకె కూడా షేర్ చేయడానికి మేం అనుమతివ్వం’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.

News February 3, 2026

పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.