News June 12, 2024

త్వరలో ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్?

image

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్‌ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 5నే మూవీ విడుదల కావాల్సి ఉండగా సైఫ్ అలీఖాన్ గాయపడటంతో షూట్ ఆలస్యమై అక్టోబర్ 10కి వాయిదా వేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 27కు ప్రీపోన్ చేయాలని చూస్తున్నట్లు టాక్.

Similar News

News December 2, 2025

రాజ్ భవన్ ఇకపై ‘లోక్ భవన్’

image

గవర్నర్ అధికారిక నివాస, కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారింది. ‘లోక్ భవన్‌’గా మారుస్తూ గత నెల 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై దేశంలోని రాజ్ భవన్‌‌లను లోక్ భవన్‌గా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నారు. కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

News December 2, 2025

HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

image

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.

News December 2, 2025

హనుమాన్ చాలీసా భావం – 27

image

సబ పర రామ తపస్వీ రాజా। తినకే కాజ సకల తుమ సాజా॥
రాముడు రాజైనా రుషిలా నిగ్రహం, ధర్మపాలన కలవాడు. అలాంటి ధర్మమూర్తి సీతాన్వేషణ, లంకా విజయం వంటి ముఖ్య కార్యాలన్నీ ఆంజనేయుడే చక్కబెట్టాడు. హనుమంతుడు రామునికి కేవలం సేవకుడు కాదు, గొప్ప కార్యసాధకుడు. ఈ కథ మనకు కర్తవ్య నిష్ఠను బోధిస్తుంది. మన లక్ష్యం గొప్పదైనా, నిస్వార్థ సేవ, సంకల్పబలంతో తప్పక విజయం సాధించవచ్చు. <<-se>>#HANUMANCHALISA<<>>