News April 7, 2024
పుష్ప-2 నుంచి క్రేజీ అప్‌డేట్

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. రేపు ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రేపు టీజర్ విడుదల టైమ్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 8న ఉదయం 11.07 గంటలకు పుష్పరాజ్ వస్తాడని పేర్కొన్నారు. దీంతో పుష్ప-2 టీజర్‌పై మరింత ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న టీజర్ నెట్టింట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Similar News
News January 14, 2026
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ సర్వీసులు నడపాలి: MLA

AP: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైనా విశాఖ నుంచి కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసులకైనా అవకాశమివ్వాలని MLA విష్ణుకుమార్ రాజు కోరారు. ‘VSP నుంచి ఏటా 30L మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భోగాపురం చేరాలంటే 2 గంటల సమయం, ట్యాక్సీలకు ₹4500 వరకు ఖర్చు అవుతుంది. విజయవాడకు వందేభారత్ ట్రైన్లో 4 గంటల్లో చేరుకోవచ్చు. అదే భోగాపురం నుంచి విమానంలో వెళ్లాలంటే 6గంటలు పడుతుంది. ఖర్చూ ఎక్కువే’ అని పేర్కొన్నారు.
News January 14, 2026
కాసేపట్లో వర్షం..

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్‌చెరు, లింగపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
News January 14, 2026
ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. రాజ్‌కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్‌గా రాహుల్‌కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.


