News July 21, 2024

CRDA అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం బదిలీ

image

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆయన్ను రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు అధికారిగా నియమించారు. ITDA ప్రాజెక్టు అధికారిగా చేస్తున్న సూరజ్ గనోరే ధనుంజయ్‌ను పల్నాడు జేసీగా నియమించిన విషయం తెలిసిందే.

Similar News

News November 21, 2025

వర్షాలు పడే అవకాశం పంటలు జాగ్రత్త: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.

News November 21, 2025

GNT: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవిప్రియ వర్ధంతి

image

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (షేక్ ఖాజాహుస్సేన్) వర్ధంతి నేడు. గుంటూరులో జన్మించిన ఆయన ‘పైగంబర కవుల’ బృందంలో ఒకరు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన పాత్రికేయుడిగా ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ వంటి దినపత్రికలలో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఆయన ‘రన్నింగ్ కామెంటరీ’ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.

News November 21, 2025

GNT: మీసాల కృష్ణుడు బెల్లంకొండ సుబ్బారావు వర్ధంతి

image

ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది బెల్లంకొండ సుబ్బారావు వర్ధంతి నేడు. ఆయన 1902లో కారంపూడిలో జన్మించారు. 1952 నవంబర్ 21న పరమపదించారు. సుబ్బారావు నాటక రంగంలో శ్రీకృష్ణుడి పాత్రకు జీవం పోశారు. పాండవోద్యోగ విజయాలు నాటకంలో ఆయన కృష్ణ పాత్రధారణ తారాస్థాయిని అందుకుంది. కృష్ణ వేషధారణలో మీసాలు ధరించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన్ను మీసాల కృష్ణుడు అని పిలిచేవారు. శ్రీకృష్ణ పాత్రకు అంకితమైన నటుడిగా పేరు పొందారు.