News November 6, 2024
CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం
సీఆర్డీఏ పరిధి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సీఆర్డీఏ పరిధిలోకి చేరింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1069.55 చదరపు కి.మీ విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను చేర్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధి నిధులతో పల్నాడు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 2, 2024
ఈనెల 7న గుంటూరులో ఫ్లాగ్ డే: కలెక్టర్
ఈనెల 7వ తేదీన గుంటూరులో ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన స్టిక్కర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ విరాళాలు దేశ భద్రత కోసం అసువులు బాసిన వీర జవానుల కుటుంబ సభ్యులకు ఎంతో కొంత తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News December 2, 2024
అమరావతి: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సమీక్ష
పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సిఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు.
News December 2, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు ఎంత మంది అంటే?
అధికారిక గణాంకాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు భారీగా ఉన్నారు. గుంటూరులో 16,630, పల్నాడులో 17,536, బాపట్లలో 11,356 మంది HIV రోగులుండగా, 2023లో అత్యల్ప సంఖ్యలో కొత్తగా వైరస్ సోకిన జిల్లాలో గుంటూరు ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు AP స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందుతుంది.