News July 17, 2024

అమరావతిని NHతో కనెక్ట్ చేసేలా సీఆర్డీఏ ప్లాన్

image

AP: రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానించేలా CRDA ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీడ్ యాక్సిస్ రోడ్డు తరహాలో మరో రెండు రోడ్లు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేకు ఈ-11, 12 రోడ్లను కనెక్ట్ చేయాలని, కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 23, 2026

రెండు దశల్లో జనగణన: VZM కలెక్టర్

image

జనాభా లెక్కలు రెండు దశల్లో నిర్వహిస్తామని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండో దశలో వచ్చే ఏడాది జనాభా గణన జరుగుతుందని చెప్పారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, నిబంధనలు పాటిస్తూ తప్పులు లేకుండా లెక్కింపు చేయాలని సూచించారు. ఈసారి జనగణన పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుందని తెలిపారు.

News March 23, 2026

‘ధురంధర్-2’ కలెక్షన్ల సునామీ.. పుష్ప-2 రికార్డు సేఫ్

image

‘ధురంధర్- 2’ సినిమా తొలి నాలుగు రోజుల్లో రూ.761 కోట్ల కలెక్షన్లు <<19454612>>సాధించినప్పటికీ<<>> పుష్ప-2 రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఓపెనింగ్ వీకెండ్‌లో రూ.795 కోట్లతో అల్లు అర్జున్ సినిమా టాప్‌లోనే ఉందని Sacnilk వెల్లడించింది. అయితే బాహుబలి-2(రూ.615 కోట్లు), RRR(రూ.568 కోట్లు), KGF-2(రూ.546 కోట్లు) మూవీలను వెనక్కి నెట్టినట్లు పేర్కొంది.

News March 23, 2026

పెండింగ్ బకాయిల విడుదల, PRCపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రతినెలా ఇస్తోన్న ₹700 కోట్లను ₹1,000 కోట్లకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 1వ తేదీనే జీతాలు, క్యాష్‌లెస్‌ హెల్త్ కార్డ్స్, పెండింగ్ DAల విడుదల, ₹1.25 కోట్ల ప్రమాద బీమా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే PRCపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.