News July 31, 2024
భూమిపై నీటి సృష్టి.. ‘సల్ఫర్’ కీ రోల్

మానవాళికి, జంతు, వృక్షజాలాలకు నీరే(H2O) ఆధారం. ఇందులో ఆక్సిజన్, హైడ్రోజన్ ప్రధాన మూలకాలు. భూమి ఏర్పడిన తర్వాత నీరు తయారవడంలో సల్ఫర్ కీలక పాత్ర పోషించినట్లు తాజాగా పరిశోధకులు తేల్చారు. నీరు లేని తొలినాళ్లలో హైడ్రోజన్ సూర్యుడి వేడిని తట్టుకునేందుకు సల్ఫర్తో కలిసి ఉండేదట. అలా తట్టుకొని ఉన్న హైడ్రోజన్ కాలక్రమేణా సల్ఫర్ నుంచి విడిపోయి ఆక్సిజన్తో కలవడంతో నీరు ఆవిర్భవించినట్లు సైంటిస్టులు తెలిపారు.
Similar News
News October 17, 2025
110 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 110 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, వెల్డర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్+సంబంధిత విభాగంలో ITI పాసైనవారు అర్హులు. వయసు 30ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ OCT 30. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News October 17, 2025
ఎడారి నేలకు జలకళ తెచ్చిన ‘ఆమ్లా రుయా’

ఎడారికి ప్రాంతమైన రాజస్థాన్లో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆమ్లా రుయా 1998లో ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 200 కుంటలు, బావులు, 317 చెక్ డ్యామ్లు నిర్మించారు. వీటితో అక్కడి పేద ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కృషిచేసి ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ✍️ మహిళల స్ఫూర్తిదాయక కథనాలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 17, 2025
2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ రెడీ: ఇస్రో

మన సొంత స్పేస్ స్టేషన్ కల 2035 నాటికి నెరవేరనుంది. దీని ఇనిషియల్ మాడ్యూల్స్ 2027 నుంచి ఇన్స్టాల్ చేస్తామని ISRO ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ’చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్తో దాని తదుపరి ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. గగన్యాన్-3 కూడా రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్తున్నాం. టెలికాం, వెదర్, డిజాస్టర్ ఇలా అనేకరకాల మేలు జరుగుతోంది’ అని అన్నారు.