News October 22, 2024

ఫ్రీ మీల్స్‌తో క్రియేటివిటీ, కోఆపరేష‌న్: సుంద‌ర్ పిచ్చాయ్‌

image

ఆఫీసులో ఫ్రీ మీల్స్ ఏర్పాటుతో ఉద్యోగుల్లో సృజ‌నాత్మ‌క‌త‌, స‌హకార ధోర‌ణి పెరుగుతాయని ఆల్ఫాబెట్ CEO సుంద‌ర్ పిచ్చాయ్ అన్నారు. ఉద్యోగంలో చేరిన తొలి నాళ్ల‌లో కేఫేలో ఇత‌రులతో చర్చల వల్ల ప‌నిప‌ట్ల ఉత్సుక‌త పెరిగి క్రియేటివిటీ ప‌నితీరుకు దోహదం చేసేద‌ని పేర్కొన్నారు. గూగుల్ కొత్త ఐడియాస్ సంస్థ‌లోని కేఫే చ‌ర్చ‌ల్లో పుట్టుకొచ్చిన‌వే అని వివ‌రించారు. ఫ్రీ మీల్స్‌తో ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువన్నారు.

Similar News

News October 22, 2024

సిరాజ్ పేలవ ప్రదర్శన.. జట్టు నుంచి తప్పించాలని డిమాండ్!

image

ఈ ఏడాది టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని పేసర్ సిరాజ్‌ను టీమ్ నుంచి తప్పించాలని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన సిరాజ్ 12 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇటీవల NZతో తొలి టెస్టులో 2 వికెట్లు తీశారు. దీంతో అతడిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి, నెక్స్ట్ మ్యాచులో ఆకాశ్ దీప్‌కు ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

News October 22, 2024

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సచివాలయంలో ఉ.11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్త పన్ను రద్దు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించనుంది.

News October 22, 2024

రేపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ

image

భార‌త ప్ర‌ధాని మోదీ, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌ల భేటీ ఖరారైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బుధవారం ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ వెల్లడించారు. తూర్పు లద్దాక్‌లో పెట్రోలింగ్‌పై భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం భేటీ జరగనుండడం గమనార్హం.