News April 8, 2025

CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్‌గా ధర్మేందర్

image

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది.‌ విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

Similar News

News April 23, 2025

చంద్రమౌళి కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మంత్రి 

image

జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో విశాఖ వాసి చంద్రమౌళి మృతి పట్ల విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో ఉన్న చంద్రమౌళి భార్య, కుటుంబ సభ్యులను ఫోన్‌ చేసి ఓదార్చారు. ఉగ్రదాడుల్లో చంద్రమౌళి మృతి బాధాకరమన్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News April 23, 2025

విశాఖకు చంద్రమోళి మృతదేహం

image

ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమోళి మృతదేహాన్ని ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ విమానం విశాఖ చేరుకోనుంది. వేసవి నేపథ్యంలో పాడురంగపురం ప్రాంతానికి చెందిన చంద్రమోళితో పాటు మరో రెండు కుటుంబాలు పహల్గాం టూర్‌కు వెళ్లారు. ఉగ్రమూకల దాడిలో చంద్రమోళి మృతి చెందడంతో పాడురంగపురంలో విషాదచాయలు అలముకున్నాయి.

News April 23, 2025

విశాఖ డాక్టర్‌‌కు సివిల్స్‌లో 975వ ర్యాంక్

image

చినవాల్తేరు పీహెచ్సీలో పనిచేస్తున్న డా.మానస సివిల్స్‌కు ఎంపికయ్యారు. సివిల్స్ ఫలితాల్లో రావాడ సాయి మోహన మానస 975వ ర్యాంకు కొట్టి ఆదర్శంగా నిలిచింది. మానస తండ్రి రావాడ ప్రకాశరావు శ్రీకాకుళం మొబైల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మానస తల్లి కె.ఉషారాణి రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పని చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో ఆమె సివిల్స్ ర్యాంక్ సాధించారు.

error: Content is protected !!