News December 22, 2025
Credit Card Scam: లిమిట్ పెంచుతామంటూ..

‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న చందంగా మారింది సైబర్ మోసగాళ్ల పని. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఈ మధ్య కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు సంస్థలకు చెందిన వాళ్లమని నమ్మబలుకుతారు. OTP, CVV వంటి కీలక సమాచారాన్ని లాగుతారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు పేరిట లింక్ పంపి బురిడీ కొట్టిస్తారు.
Similar News
News December 22, 2025
IT అధికారులు మీ వాట్సాప్, మెయిల్ చెక్ చేస్తారా?

ఏప్రిల్ 2026 నుంచి ట్యాక్స్ పేయర్స్ వాట్సాప్, ఈమెయిల్స్‌ను అధికారులు చూస్తారంటూ SMలో ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే Income Tax Act 2025లోని సెక్షన్ 247 కేవలం ట్యాక్స్ ఎగవేసే వారి కోసమే తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. నోటీసులకు స్పందించని, ఆదాయం దాచే వారి డిజిటల్ డేటాను కోర్టు పర్మిషన్, సరైన రీజన్‌తో మాత్రమే చెక్ చేసేలా పాత చట్టాన్ని డిజిటల్ కాలానికి తగ్గట్టుగా మార్చారని తెలిపారు.
News December 22, 2025
విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ

TG: విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారైంది. ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు Dy.CM భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే వర్తించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
News December 22, 2025
ఈసారైనా ‘సినిమా’ సమస్యలకు పరిష్కారం దొరికేనా?

తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’లా ఉంది. టికెట్ రేట్లు పెంచితే ప్రేక్షకులు థియేటర్‌కు రావట్లేదు. తగ్గిస్తే నిర్మాతలకు గిట్టుబాటు కావట్లేదు. ఈ క్రమంలో త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలపై సమావేశం నిర్వహిస్తామని AP మంత్రి దుర్గేశ్ చెప్పారు. APలో షూటింగ్ చేస్తే ప్రోత్సాహకాలిస్తామని, మూవీ టికెట్ రేట్ల పెంపుపైనా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి ఈసారైనా పరిష్కారం దొరుకుతుందా?


