News August 27, 2024
కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్‌దే: బండి సంజయ్

TG: BRS MLC కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్రైమ్, వైన్, డైన్‌లో భాగస్వాములైన BRS, కాంగ్రెస్‌ల అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘బెయిల్ కోసం పోరాడిన కాంగ్రెస్ తరఫు న్యాయవాదులకు శుభాకాంక్షలు. కవిత బెయిల్‌పై బయటకు రావడం, ఈ కేసును వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో KCR చతురత ప్రదర్శించారు’ అని సెటైర్లు వేశారు.
Similar News
News February 18, 2026
తిరుపతి: ఫీజు కడితేనే హాల్ టికెట్..!

ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఫీజుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజు మొత్తం కట్టి హాల్ టికెట్ తీసుకెళ్లాలని, లేకపోతే మీరే ఇబ్బంది పడతారని బెదిరిస్తున్నారట. ప్రతిసారి ఇదే జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.


