News July 23, 2024
MSMEల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం: నిర్మల

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘దీని ద్వారా టర్మ్ లోన్లను జారీ చేస్తాం. పాత లోన్లను క్లియర్ చేసిన వారికి ‘ముద్ర’ రుణాల పరిమితిని ప్రస్తుతమున్న రూ.10లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతాం. కొవిడ్ సమయంలో MSME రంగం తీవ్రంగా దెబ్బతింది. అది కోలుకునేందుకు ఈ రుణాలు ఉపకరిస్తాయి’ అని తెలిపారు.
Similar News
News March 26, 2026
నెల్లూరు: ఘోర ప్రమాదం.. సంచలన విషయాలు

మార్కాపురంలో ప్రమాదం జరగకముందే బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారంట. జగిత్యాల నుంచి నెల్లూరు(D) వింజమూరుకు నిన్న సాయంత్రం ఈ బస్సు బయల్దేరింది. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులకు గురికావడంతో గంటపాటు రిపేర్ చేశారని సమాచారం. సంక్రాంతి సమయంలోనూ ఈ బస్సుకు భారీగా ఫైన్ పడినట్లు తెలుస్తోంది. మార్కాపురం వద్ద స్టీరింగ్ స్ట్రక్ట్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ అధికారుల విచారణలో చెప్పాడు.
News March 26, 2026
చరణ్‌కు సర్జరీ.. వైద్యుడికి చిరు థాంక్స్

‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో రామ్ చరణ్ కంటిరెప్ప పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సకాలంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు నైపుణ్యంతో చేసిన సర్జరీ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ నైపుణ్యం దానిని తొలగించింది. మీకు కృతజ్ఞులం’ అని చిరు ట్వీట్ చేశారు.
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

AP: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2లక్షలు.. గాయపడ్డ వారికి ₹50వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు సహకారం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపిన జగన్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


