News February 24, 2025

CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

image

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.

Similar News

News February 24, 2025

కోహ్లీ ఊచకోత.. పాకిస్థానీ ట్వీట్ వైరల్!

image

పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పూనకంతో సెంచరీల మోత మోగిస్తుంటారు. నిన్న కూడా CTలో పాకిస్థాన్‌తో మ్యాచులో సెంచరీతో ఇండియాను గెలిపించారు. అయితే, కోహ్లీ బ్యాటింగ్‌పై ఓ పాకిస్థానీ తన ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఈ విరాట్ కోహ్లీ ఎప్పుడూ మనపైనే ఎందుకు ఎక్కువ కసిగా ఆడతాడు. మనం అతడిని ఏమైనా బాధపెట్టామా? మనమేం చేశాం’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి మీరు COMMENTలో సమాధానం చెప్పండి.

News February 24, 2025

WFH.. ఇక ఉండదా?

image

కరోనా టైంలో ఎక్కువగా వినిపించిన పేరు వర్క్ ఫ్రం హోం(WFH). కొన్ని కీలక రంగాలు తప్ప చాలా మంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేశారు. ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. చాలా కంపెనీలు WFH మోడ్‌ను ఎత్తివేస్తూ, ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశంలో WFH పూర్తిగా ఉండదా? హైబ్రిడ్ మోడల్ ఉద్యోగాలు ఉంటాయా? అనే చర్చ మొదలైంది. WFH ఉద్యోగాలపై మీ అభిప్రాయం ఏంటి?

News February 24, 2025

KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

image

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.

error: Content is protected !!