News November 24, 2024
పంజాబ్ కింగ్స్‌పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

PBKS ఫ్రాంచైజీపై క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో ఆ జట్టులో మళ్లీ ఆడటం తన వల్ల కాదని తేల్చిచెప్పారు. గౌతమ్ 2020లో పంజాబ్ తరఫున ఆడారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నా 100 శాతం ప్రదర్శన ఇస్తాను. కానీ పంజాబ్‌కు అలా ఆడలేను. క్రికెట్పరంగానే కాక ఇతర వ్యవహారాల్లోనూ ఆ జట్టుతో నాకు మంచి అనుభవం లేదు. క్రికెటర్‌గా నన్ను ఎలా ట్రీట్ చేయాలనుకుంటానో అలా వారు వ్యవహరించలేదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 16, 2026
మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.
News January 16, 2026
ట్రంప్ ఒత్తిడితో మోదీ చాబహార్ పోర్టును వదిలేశారు: కాంగ్రెస్

PM మోదీ మరోసారి ట్రంప్‌కు సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడితో ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని పేర్కొంది. 120 మిలియన్ డాలర్ల భారత ట్యాక్స్ పేయర్ల డబ్బును మోదీ అందులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడది వృథా అయిందని విమర్శించింది. అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఏషియాకు వెళ్లేందుకు ఈ పోర్ట్ ఎంతో కీలకమని తెలిపింది. మోదీ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.
News January 16, 2026
గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

TG: గత ప్రభుత్వం సొంత లాభం మాత్రమే చూసుకుందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది. ప్రాణాలకు తెగించి మరీ యువకులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. కానీ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము TGPSCని ప్రక్షాళించి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని గ్రూప్-3 నియామకపత్రాల పంపిణీలో తెలిపారు.


