News February 16, 2025
ప్రేయసిని పెళ్లి చేసుకోనున్న క్రికెటర్

ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ పెళ్లి చేసుకోనున్నారు. తన ప్రేయసితో ఉన్న ఫొటోను ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘ఈ అమ్మాయిని శాశ్వతంగా ప్రేమిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. ఆమెకు రింగ్ ఇచ్చి మ్యారేజ్ ప్రపోజ్ చేయగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో గ్రీన్‌కు క్రీడా వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News December 5, 2025
ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్ఛార్జ్ PO సమావేశం

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్‌లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


