News December 31, 2025
Crime Report: ‘నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి’

సత్యసాయి జిల్లాలో 2025లో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు SP సతీశ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వార్షిక నివేదిక విడుదల చేశారు. జిల్లాలో మొత్తం నేరాల నమోదు 2 శాతం పెరిగినా, హత్యలు, కిడ్నాపులు, తీవ్రమైన నేరాలు తగ్గాయని వివరించారు. రోడ్డు ప్రమాద మరణాలు 11 శాతం తగ్గాయని, హిందూపురం బ్యాంకు దోపిడీ కేసును ఛేదించి రూ.5.5 కోట్ల బంగారం రికవరీ చేశామని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
భూపలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్‌లోని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాల గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. మున్సిపల్, ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లదారు. అదనపు కలెక్టర్ విజయలక్మి, లోక్ నాయక్ ఉన్నారు.
News January 8, 2026
జిల్లా మలేరియా అధికారిగా నాగార్జున

జిల్లా మలేరియా నూతన అధికారిగా నాగార్జున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ తనకు కేటాయించిన లక్ష్యాలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఆయన అన్నారు. నూతన వైద్యాధికారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
News January 8, 2026
అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు

అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత దృష్ట్యా లాయర్లు, సిబ్బందిని వెలుపలికి పంపారు. డీఎస్పీ శ్రీనివాసులు నాయకత్వంలో బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్ కోర్టు ప్రాంగణంలో సుదీర్ఘ తనిఖీలు చేపట్టాయి. ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


