News March 7, 2025
OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘రేఖాచిత్రం’

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేఖాచిత్రం’ ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్‌లో ఈ మూవీ తెలుగుతోపాటు మొత్తం ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ లీడ్ రోల్‌లో నటించారు. గత జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
Similar News
News March 27, 2026
ఈ తగ్గింపు ఎన్నికల వరకేనా: రాజ్‌దీప్

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల(మే 4) వరకేనా లేక కొనసాగుతుందా? అని జర్నలిస్ట్ రాజ్‌దీప్ ప్రశ్నించారు. గతంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు చేకూర్చలేదని విమర్శించారు. ఇంధన ధరలు మార్కెట్ పరిస్థితుల కంటే ఎన్నికలపై ఆధారపడ్డాయని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
News March 27, 2026
RCBvsSRH.. ప్లేయింగ్-11 అంచనా ఇదే!

క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. రేపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో RCB, SRH తలపడనున్నాయి. ఇరు జట్ల ప్లేయింగ్-11 అంచనా ఇలా ఉంది.
RCB: కోహ్లీ, సాల్ట్, వెంకటేశ్, రజత్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, జాకోబ్, మంగేశ్
SRH: అభిషేక్, హెడ్, కిషన్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్, అనికేత్, బ్రైడన్, హర్షల్, శివ్‌నాగ్, జీషన్
News March 27, 2026
KBCలో రూ.50 లక్షలు గెలిచి.. అవినీతి కేసులో జైలుపాలు

అమితాబ్ నిర్వహించే KBC షోలో రూ.50 లక్షలు గెలిచిన మహిళా తహశీల్దార్ అమితా సింగ్ తోమర్ వివాదంలో చిక్కుకున్నారు. రూ.2.5 కోట్ల వరద సహాయ నిధి స్కామ్‌లో ఆమె పాత్ర ఉందంటూ గ్వాలియర్(MP) పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం జైలుకు తరలించారు. దీంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ కేసులో తోమర్ ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించాయి.


