News November 5, 2024
కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: నిరంజన్

TG: రాష్ట్రంలో రేపటి నుంచి <<14533351>>కులగణన సర్వే<<>> జరగనుంది. ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్తులో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News December 15, 2025
అంచనాలను అందుకోని రబీ సాగు

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.
News December 15, 2025
లెజెండరీ సింగర్ బయోపిక్లో సాయిపల్లవి

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్లో హీరోయిన్ సాయిపల్లవిని తీసుకునే యోచనలో ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News December 15, 2025
ఎయిమ్స్ కల్యాణిలో 172 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

పశ్చిమ బెంగాల్లోని <


