News December 5, 2024

అల్లు అర్జున్ టీంపై క్రిమినల్ కేసు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్‌పై HYD చిక్కడపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిన్న సంధ్య థియేటర్‌లో ప్రీమియర్స్ సందర్భంగా సినిమా చూసేందుకు బన్నీ వస్తున్నట్లు పోలీసులకు సరైన సమయంలో చెప్పలేదని ఆయన టీంపై అభియోగాలు మోపారు. చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పోలీసులు మండిపడ్డారు. కాగా ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News March 26, 2026

ఏప్రిల్ 4 నుంచి టెన్త్ వాల్యుయేషన్

image

APలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ APR 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా APR మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

News March 26, 2026

నేపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.187

image

యుద్ధ ప్రభావంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

News March 26, 2026

ధురంధర్-2పై ఏఐ వీడియోలు.. డైరెక్టర్ వార్నింగ్

image

ధురంధర్-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు డైరెక్టర్ ఆదిత్య ధర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు చిత్రంలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. రెచ్చగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని SMలో హెచ్చరించారు.