News June 12, 2024
‘కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు!

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి అధికారులు సరైన వివరాలు వెల్లడించాలని కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్లో పొందుపరచాలని స్పష్టం చేశారు. అందులో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా, బ్యారేజీలపై విచారణకు ప్రభుత్వం ఘోష్ అధ్యక్షతన కమిషన్ను నియమించింది.
Similar News
News January 30, 2026
30 ఏళ్లుగా మగాడిలా… ఆ తల్లి ఎందుకలా మారింది?

తూత్తుకుడి(TN)కి చెందిన పెచియమ్మాళ్(57) 30 ఏళ్లుగా పురుషుడిగా జీవిస్తోంది. దీని వెనుక కన్నీటి కథ ఉంది. పెళ్లి జరిగిన 15 రోజులకే భర్త చనిపోయాడు. గర్భంతో ఉన్నట్లు తర్వాత తెలిసింది. బిడ్డ కోసం, వేధింపులను తప్పించుకునేందుకు మగాడిగా మారింది. జుట్టు కత్తిరించుకుని, ముత్తుగా ఐడెంటిటీని మార్చుకుంది. ఏళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి కూతురిని పెంచింది. ఇటీవల పెళ్లి చేసింది. ఇకపైనా ముత్తుగానే ఉంటానని అంటోంది.
News January 30, 2026
ఫామ్హౌస్లో కుదరదు.. నందినగర్లోనే విచారణ: సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఎర్రవల్లి ఫామ్హౌస్లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే రేపు విచారించాల్సి ఉండగా కేసీఆర్ అభ్యర్థనతో విచారణ తేదీని మార్చారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) మ.3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తాజాగా మరో నోటీసు ఇచ్చారు.
News January 30, 2026
గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్.. మెటల్ స్టాక్స్ ఢమాల్

బంగారం, వెండి సహా బేస్ మెటల్స్ ధరలు భారీగా తగ్గడంతో ఈరోజు లోహపు షేర్ల విలువలు పడిపోయాయి. హిందూస్థాన్ జింక్ (12%), వేదాంత (11%), NALCO (10%), హిందూస్థాన్ కాపర్ (9.5%), హిందాల్కో (6%), NMDC (4%) స్టాక్స్ వాల్యూస్ కుంగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. డాలర్ పుంజుకోవటంతో ఓ దశలో గోల్డ్ ధరలు 9%, సిల్వర్ రేట్లు 15% మేర కరెక్ట్ అయ్యాయి.


