News October 9, 2025

బిలియనీర్ల క్లబ్‌లోకి క్రిస్టియానో రొనాల్డో

image

బిలియనీర్‌ అయిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ రొనాల్డో నిలిచారు. ఆయన సంపద $1.4bn(₹12,352.08Cr) అని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. 2002-2023 మధ్య మ్యాచుల ద్వారా $550M+(₹4,869.57Cr), నైక్‌ (₹159.25Cr), అర్మానీ, కాస్ట్రోల్ బ్రాండ్లు, ఇతర ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ₹1,554Crకు పైగా ఆర్జించినట్లు పేర్కొంది. సౌదీ క్లబ్ అల్-నాస్ర్‌‌తో 2023లో $200M, తాజాగా $400Mలకు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.

Similar News

News October 9, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఆర్టీసీ సిటీ బస్ ఛార్జీల పెంపుకు నిరసనగా నేడు ‘చలో బస్‌భవన్’కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఆందోళనలో పాల్గొననున్న KTR, హరీశ్ రావు
* బీఆర్ఎస్ నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదం: మంత్రి పొన్నం
* నేటి నుంచి HYDలోని రవీంద్రభారతిలో ఆర్టీఐ 20వ వారోత్సవాలు.. చీఫ్ గెస్ట్‌గా జిష్ణుదేవ్ వర్మ
* సింగరేణిలో సమ్మెలపై 2026 మార్చి 11 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు

News October 9, 2025

ఇతిహాసాలు క్విజ్ – 30

image

1. అశోకవనంలో సీతాదేవికి అండగా ఉండి, ధైర్యం చెప్పిన రాక్షస స్త్రీ ఎవరు?
2. శ్రీకృష్ణుడి శంఖం పేరేంటి?
3. భాగవతం రాయమని వేద వ్యాసుడిని ప్రేరేపించింది ఎవరు?
4. సూర్యుడి వాహనం ఏది?
5. ఏకోన వింశతి: అంటే ఎంత?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 9, 2025

ఈ నెల 13 నుంచి స్కూళ్లకు కొత్త టీచర్లు

image

AP: మెగా DSCలో ఎంపికైన టీచర్లు ఈ నెల 13న స్కూళ్లలో చేరనున్నారు. పోస్టింగ్‌ల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు 9, 10 తేదీల్లో అవకాశం ఇచ్చారు. ఆప్షన్ల నమోదు అనంతరం 11 లేదా 12వ తేదీన స్కూళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. 16,347 పోస్టులకు మెగా DSC నిర్వహించగా, 15,941 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలాయి. కాగా కొత్త టీచర్లకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది.