News March 27, 2025
5 వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు

AP: ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 5 ప్రభుత్వ వైద్య శాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి. వాటిలో రంగరాయ మెడికల్ కాలేజీ, రాయచోటి, చీరాల, పాలకొండ, భీమవరం ఏరియా ఆస్పత్రులున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.23.75 కోట్ల చొప్పున మొత్తం రూ.118.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఆస్పత్రుల్లో 50 బెడ్స్‌తో ఐసీయూ విభాగాలు ఏర్పాటవుతాయి.
Similar News
News March 30, 2025
ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ షాక్

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది. 197 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఓవర్లన్నీ ఆడి 160/6 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (48), తిలక్ వర్మ (39) మాత్రమే రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా ముంబైకిది వరుసగా రెండో ఓటమి. గుజరాత్‌కు ఇదే తొలి విజయం.
News March 30, 2025
ఆర్మీని తరలించడంతోనే జమ్మూలో ఉగ్రదాడులు: ఒమర్

జమ్మూలో ఉగ్రదాడులు పెరగడంపై J&K సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కఠువాలో చనిపోయిన నలుగురు పోలీసుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. చైనా చొరబాట్లను ఆపేందుకు జమ్మూ నుంచి సైన్యాన్ని లద్దాక్‌కు తరలించడాన్ని టెర్రరిస్టులు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. క్రమంగా ఈ పరిస్థితిని అధిగమిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు.
News March 30, 2025
సంక్రాంతికి పొలిమేర-3: డైరెక్టర్

చిన్న సినిమాలుగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘పొలిమేర’ 1&2లకు సీక్వెల్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. ‘ఇది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తాం. ఇందులో ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తారు’ అని చెప్పారు. కాగా ఆయన డైరెక్షన్ చేసిన 28 డిగ్రీస్ మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.