News March 6, 2025
బాబర్ ఆజమ్‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం

CTలో విఫలమైన పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను విమర్శించిన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌పై ఆయన తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2024 ICC T20 టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ను నేషనల్ T20 జట్టు నుంచి తొలగించారు. PSLలో రాణించి అతడు కమ్‌బ్యాక్ ఇస్తాడు. అతడిని విమర్శించే మాజీ క్రికెటర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నా. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు తట్టుకోలేరు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
Similar News
News April 2, 2026
రేపు జాగ్రత్త: APSDMA

AP: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDMA వెల్లడించింది. 42-43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ గరిష్ఠంగా విజయనగరం జిల్లా రాజాంలో 40.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది.
News April 2, 2026
IPL: కోర్టుకెక్కిన RCB ప్లేయర్!

IPLలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదని శ్రీలంక క్రికెట్ బోర్డుపై నువాన్ తుషారా(RCB) కోర్టుకెక్కారు. తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వలేదని, IPLలో ఆడేందుకు క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొలంబో జిల్లా కోర్టులో కేసు వేశారు. ఈ నెల 9న కోర్టు దీన్ని విచారించనున్నట్లు తెలుస్తోంది. విదేశీ T20 లీగ్స్‌లో ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ ప్రమాణాలను తుషారా అందుకోలేకపోవడంతోనే NOC ఇవ్వలేదని సమాచారం.
News April 2, 2026
రాముడి పాత్రకు తొలుత నో చెప్పిన రణ్‌బీర్.. కారణమిదే

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాలో రాముడి పాత్ర పోషించేందుకు తొలుత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నో చెప్పారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాముడి పాత్రకు తాను సరిపోనని, దానికి పూర్తి న్యాయం చేయలేనని భావించినట్లు తెలిపారు. అయితే బిడ్డకు తండ్రయ్యాక రాముడి పాత్ర చేయాలనిపించిందని పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం స్మోకింగ్, నాన్ వెజ్ మానేశానని వివరించారు.


