News October 26, 2024
గంభీర్ కోచింగ్‌పై విమర్శలు

స్వదేశంలో తొలిసారిగా న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడటంపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచే ఓటములు మొదలయ్యాయంటూ ఆరోపిస్తున్నారు. శ్రీలంకపై 27 ఏళ్లలో తొలిసారిగా వన్డే సిరీస్ ఓటమి, స్వదేశంలో 12ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఓటమి గంభీర్ వైఫల్యాలేనంటూ విమర్శిస్తున్నారు. ఆటగాళ్లు విఫలమైతే కోచ్ ఏం చేస్తారంటూ గంభీర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
Similar News
News November 21, 2025
ఫార్ములా ఈ కేసులో చట్టపరంగానే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో చట్టపరంగానే చర్యలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన నల్గొండలో స్పందించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
News November 21, 2025
స్వీట్ కార్న్.. కోత సమయాన్ని ఎలా గుర్తించాలి?

తీపి మొక్కజొన్న కండెలపై కొంచెం ఎండిన పీచు, కండెపై బిగుతుగా ఉన్న ఆకు పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గింజపై గిల్లితే పాలు కారతాయి. ఈ సమయంలో కండెలను కోయడం మంచిది. కోత ఆలస్యమైతే గింజలోని తీపిదనం తగ్గుతుంది. తీపి మొక్కజొన్నను దఫదఫాలుగా విత్తుకుంటే పంట ఒకేసారి కోతకు వచ్చి వృథా కాకుండా పలు దఫాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


