News July 14, 2024
గిల్‌పై విమర్శలు.. స్పందించిన జైస్వాల్

జింబాబ్వేతో నిన్న జరిగిన 4వ T20లో గిల్ స్ట్రైకింగ్ <<13623798>>ఇవ్వకపోవడంతో<<>> జైస్వాల్ సెంచరీ మిస్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. దీనిపై గిల్‌కు మద్దతుగా జైస్వాల్ స్పందించారు. ‘గిల్, నేను వికెట్ పడకుండా మ్యాచ్‌ను త్వరగా ముగించాలనే లక్ష్యంతోనే ఆడాం. అతడితో కలిసి పరుగులు చేయడాన్ని ఆస్వాదించా’ అని స్పష్టత ఇచ్చారు. కాగా జైస్వాల్ 93 రన్స్‌తో అజేయంగా నిలిచి సెంచరీ మిస్ చేసుకున్నారు.
Similar News
News January 1, 2026
IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.
News December 31, 2025
2026లో టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

టీమ్‌ఇండియా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్, 3 మ్యాచుల ODI సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో T20 వరల్డ్ కప్, జూన్‌లో AFGతో 3 వన్డేలు, 1 టెస్ట్, జులైలో ENGతో 5 T20s, 3 ODIs, AUGలో SLతో రెండు టెస్టులు, సెప్టెంబర్‌లో AFGతో 3 T20s, WIతో 3 వన్డేలు, 5 T20s, ఆక్టోబర్-నవంబర్‌లో NZతో 2 టెస్టులు, 3 వన్డేలు, డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది.
News December 31, 2025
మున్సిపాలిటీల గ్రేడ్ పెరిగితే ఏమవుతుందో తెలుసా?

AP: EGDt జిల్లా కొవ్వూరు, WGDt జిల్లా తణుకు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్-1లో ఉన్న తణుకు, గ్రేడ్-2లోని కదిరి మున్సిపాలిటీలను సెలక్షన్ గ్రేడ్‌కు, గ్రేడ్-3లో ఉన్న కొవ్వూరును గ్రేడ్-1కు పెంచింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది. రోడ్లు, నీరు, శానిటేషన్ వసతులు మెరుగవుతాయి.


