News March 28, 2025
‘ఎల్2: ఎంపురాన్’పై విమర్శలు!

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. అయితే, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ గ్రూప్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ సహా మరికొన్ని సన్నివేశాలు కావాలనే చేసినట్టు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. మతపరమైన వాటిలో తప్పుగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ పృథ్వీరాజ్‌పై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
Similar News
News March 31, 2025
వేసవిలో ఇలా చేయండి..

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.
News March 31, 2025
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.