News July 11, 2024

మిస్టర్ బచ్చన్‌పై విమర్శలు.. హరీశ్ శంకర్ సెటైర్

image

‘మిస్టర్ బచ్చన్’ మూవీకి సంబంధించిన ప్రోమోను ఓ నెటిజన్ విమర్శించడం చర్చనీయాంశమైంది. ‘56 ఏళ్ల రవితేజ, 25ఏళ్ల భాగ్యశ్రీతో జుగుప్సాకరమైన స్టెప్స్ వేస్తున్నారు. హీరోయిన్‌ను ఓ వస్తువులా చూపించడమే వీరిక్కావాలి’ అని ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై హరీశ్ మండిపడ్డారు. ‘కంగ్రాట్స్. బాగా కనిపెట్టావు. నోబెల్ ప్రైజ్‌కు అప్లై చేసుకో. ఇదే తరహాలో మా ఫిల్మ్ మేకర్లను వస్తువులా చూడటాన్ని కొనసాగించు’ అంటూ సెటైర్ వేశారు.

Similar News

News November 19, 2025

మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

image

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>

News November 19, 2025

కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.