News April 21, 2025
పిచ్ క్యురేటర్‌పై విమర్శలు.. కామెంటేటర్లపై CAB అసహనం

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే IPL మ్యాచులకు హర్షా బోగ్లే, సైమన్ డౌల్‌ను అనుమతించొద్దని BCCIకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లేఖ రాసింది. పిచ్ తయారీలో క్యురేటర్ BCCI రూల్ బుక్‌నే ఫాలో అయ్యారని, ఆయన తప్పేం లేదని పేర్కొంది. దీంతో నేడు KKRvsGT మ్యాచులో హర్ష, డౌల్ కనిపించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. KKR బౌలర్లకు సూట్ అయ్యేలా పిచ్ లేదని, ఆ జట్టు హోమ్ గ్రౌండ్‌ను మార్చుకోవాలని వీరు కామెంట్ చేశారు.
Similar News
News April 21, 2025
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.
News April 21, 2025
JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
News April 21, 2025
విద్యార్థుల ఫోన్ నంబర్లకే EAPCET ఫలితాలు

TG: ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థుల ఫోన్ నంబర్లకే పంపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. అప్లికేషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ, మే 2, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి 3.05 లక్షల మంది విద్యార్థులు EAPCET రాయనున్నారు. పరీక్షల అనంతరం 10 రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది.