News March 18, 2024

టెస్లా కారు డిజైన్‌పై విమర్శలు!

image

టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి బయటకు రాలేక ఆమె చనిపోయారు. గేర్ షిఫ్టింగ్‌ డిజైన్‌లో లోపాలే ఈ ఘటనకు కారణమని పలువురు టెస్లా యూజర్లు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఈ డిజైన్‌పై ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.

Similar News

News December 27, 2024

కాలువ‌లో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

image

పంజాబ్‌లోని బ‌ఠిండాలో ఓ బ‌స్సు కాలువ‌లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జ‌గ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివ‌రాల మేర‌కు వంతెన‌పై రెయిలింగ్‌ను ఢీకొన‌డంతో బ‌స్సు కాలువ‌లో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 18 మంది ప్ర‌యాణికులు షాహిద్ భాయ్ మ‌ణిసింగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

News December 27, 2024

All Time Low @ రూపాయి కన్నీళ్లు!

image

డాలర్‌తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే ఒకరోజు అతిఘోర పతనం చవి చూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది. నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 వద్ద ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్‌ఫ్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, FIIలు వెళ్లిపోవడమే పతనానికి కారణాలు.

News December 27, 2024

బేబీ హిప్పోకు భారీ విరాళం!

image

ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన థాయిలాండ్‌కు చెందిన బేబీ హిప్పో ‘మూ డెంగ్’కు జాక్ పాట్ లభించింది. ఖావో ఖీవో జూలో ఉండే ఈ హిప్పో సంరక్షణకు Ethereum సహ-వ్యవస్థాపకుడు $290,000 (సుమారు రూ. 2.51 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ 5 నెలల పిగ్మీ హిప్పో కోసం భారీ క్రిస్మస్ కానుక అందించినట్లు తెలిపారు. గత నెలలో ఆయన జూను సందర్శించినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.