News October 22, 2024
ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. EC బీజేపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఝార్ఖండ్‌లో DGPని మార్చాలని BJP కోరగానే ఈసీ ఆయనపై వేటువేసింది. అదే, మహారాష్ట్రలో ప్రస్తుత డీజీపీని తప్పించాలని కాంగ్రెస్ కోరగా ఈసీ అందుకు నిరాకరించింది. దీంతో ఇది ద్వంద్వ వైఖరి అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
Similar News
News January 23, 2026
Q3 ఫలితాల ఎఫెక్ట్.. 4 శాతం తగ్గిన ఇండిగో షేర్

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు డిసెంబరు త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లాభం ఏకంగా 78% పడిపోయి రూ.549.1 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,448.8 కోట్ల లాభం నమోదు కావడం గమనార్హం. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు, కొత్త కార్మిక చట్టాల అమలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Q3 ఫలితాల ప్రభావంతో ఇండిగో షేర్ మార్కెట్లో దాదాపు 4% పడిపోయింది.
News January 23, 2026
364 పోస్టులకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in
News January 23, 2026
KTR విచారణ.. BRS విరాళాలపై సిట్ ఆరా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది. ఓ ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వచ్చిన విరాళాలపైనా సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని రూ.కోట్లు వచ్చాయనే వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.


