News October 20, 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిచ్‌ను ఆయన సరిగా అంచనా వేయలేదని, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశారని అంటున్నారు. NZ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలోనూ బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని, అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ‘CLUELESS CAPTAIN ROHIT’ అని Xలో ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News October 21, 2024

3 నిమిషాలకు మించి హగ్ చేసుకోవద్దు: ఎయిర్‌పోర్టు

image

న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టు ఆసక్తికర నిబంధన తీసుకొచ్చింది. సెండాఫ్ ప్రాంతంలో 3 నిమిషాలకు మించి హగ్ చేసుకోకూడదని కండీషన్ పెట్టింది. మరీ బెంగగా ఉన్నవారు కారు పార్కింగ్‌లోనే కౌగిలింతలు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, కానీ ఒక హగ్‌కు 20 సెకన్ల వ్యవధి చాలని ఎయిర్ పోర్ట్ సీఈఓ డేనియెల్ డి బోనో స్పష్టం చేశారు.

News October 21, 2024

నిద్రలో ఈ మూడు దశలు తెలుసా?

image

నిద్రలో కళ్లు వేగంగా కదులుతుండే దశ(REM), నెమ్మదిగా కదిలే దశ(NREM) ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలోనూ మూడు ఉప దశలున్నాయి. తొలి ఉప దశ పేరు N1. అప్పుడప్పుడే నిద్ర పడుతున్న సమయమిది. ఇక రెండోది N2. గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మూడో ఉప దశను N3గా పిలుస్తారు. ఇది లోతైన నిద్ర. ఈ దశలో మనిషి మత్తుగా పడుకుంటాడు. N3లో ఎక్కువ సేపు ఉంటే అలసట ఉండదని పరిశోధకులు వివరించారు.

News October 21, 2024

మహిళల T20 WC విజేత న్యూజిలాండ్

image

మహిళల టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 32 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 158/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 20ఓవర్లలో 126/9 మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి T20 WC సాధించాయి.