News July 9, 2024
రోహిత్ శర్మ జెండా పాతడంపై విమర్శలు

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ ఫొటో మార్చారు. టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా నిలిచాక రోహిత్ భారత జాతీయ జెండాను మైదానంలో పాతారు. అందుకు సంబంధించిన ఫొటోనే డీపీగా పెట్టుకోగా ఆయన జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. జాతీయపతాక నియమావళి ప్రకారం జెండాను నేలపై తాకేలా ఉంచడం నేరమంటున్నారు. రోహిత్ అలా చేయకుండా ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.
News March 20, 2026
మార్చి 20: చరిత్రలో ఈ రోజు

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం
News March 20, 2026
తండ్రి అయిన RCB కెప్టెన్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్‌ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.


