News September 20, 2025

ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

image

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్‌లతో పోల్చితే 17 మోడల్స్‌లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్‌పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్‌కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.

Similar News

News September 20, 2025

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. APPLY

image

AP: SC, ST, BC, OC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షల కోసం తిరుపతి, విశాఖ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామని, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 24 నుంచి OCT 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9949686306 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: శ్రీధర్ బాబు

image

TG: H1B వీసా ఛార్జీలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘మన రాష్ట్రం నుంచి అమెరికాకు చాలామంది వెళ్లారు. ఇక్కడ కుటుంబాలు వాళ్లు పంపించే మనీ పైనే ఆధారపడుతున్నాయి. TCSలో లక్ష మంది, విప్రోలో 80 వేలు, ఇన్ఫోసిస్‌లో 60 వేల మంది USలో పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై PM మోదీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి. USతో కేంద్రం చర్చలు జరపాలి’ అని కోరారు.

News September 20, 2025

గవర్నర్, రేవంత్, కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

image

TG: రేపటి నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం KCR తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ బతుకమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రకృతి మాత బతుకమ్మను ప్రార్థిస్తున్నట్లు KCR తెలిపారు.