News December 7, 2024

పుష్ప-2 మూవీపై విమర్శలు.. స్పందించిన జాన్వీకపూర్

image

పుష్ప-2 మూవీ కారణంగా ఇంటర్ స్టెల్లార్ సినిమాకు థియేటర్లు దొరకడం లేదన్న విమర్శలపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. ‘ఇది మన సినిమా. వేరే చిత్రాల కోసం దీన్ని తక్కువ చేయవద్దు. పక్క సినిమాలపై మోజుతో మన దేశ సినిమాలను చిన్న చూపు చూస్తామా? పక్క దేశాలు మన సినిమాలను ప్రశంసిస్తుంటే మనం ఏం చేస్తున్నాం. ఇది బాధాకరం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో జాన్వీని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Similar News

News November 14, 2025

యాసంగి వరి సాగు.. ఆలస్యం వద్దు

image

TG: యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. నాట్లు ఆలస్యమైన కొద్దీ పంట దిగుబడులతో పాటు బియ్యం శాతం తగ్గి నూకశాతం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యాసంగి సాగుకు జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, R.S.R-29325, M.T.M-1010, తెల్లహంస, సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, K.N.M-1638, K.N.M-733, W.G.L-962, జగిత్యాల సాంబ J.G.L-27356, R.N.R-21278 రకాలు అనుకూలం.

News November 14, 2025

తిలకధారణలో ఉన్న శాస్త్రీయత ఏంటి..?

image

స్త్రీలు కుంకుమ ధరించడం మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. వివాహిత స్త్రీకి ఇది గొప్ప మంగళసూచకం. నుదుటి మధ్యభాగం ఆజ్ఞాచక్రం కలిగిన కేంద్రం. ఈ కేంద్రం జ్ఞానశక్తికి, ఆలోచనా శక్తికి ముఖ్య ఆధారం. ఇక్కడ కుంకుమను ధరించడం ద్వారా స్త్రీ ‘నేను శక్తి స్వరూపిణిని’ అని ప్రకటిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా మనసును ఏకాగ్రం చేసి, మనలోని శక్తిని పెంచడానికి, శాశ్వత సౌభాగ్యాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది. <<-se>>#Scienceinbelief<<>>

News November 14, 2025

పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

image

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్‌పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.