News July 18, 2024
TGలో 56.08 లక్షల ఎకరాల్లో పంటల సాగు

తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 56.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 50.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, ఈసారి అదనంగా 6 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో 206.20 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటివరకు 229.40MM వర్షాపాతం నమోదైనట్లు పేర్కొంది.
Similar News
News December 4, 2025
32వేల మంది టీచర్లకు ఊరట

పశ్చిమ బెంగాల్లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్మెంట్ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.
News December 4, 2025
వచ్చే నెలలో ‘భూభారతి’.. మూడు విడతల్లో ‘భూధార్’: మంత్రి పొంగులేటి

TG: జనవరిలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నామన్నారు. కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి భూధార్ కార్డులను సిద్ధం చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో వీటిని అందిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.


