News March 24, 2025
రాష్ట్రంలో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

TG: రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. NZB, కామారెడ్డి, ఆసిఫాబాద్, KNR, WGL, MDK, VKD, సంగారెడ్డి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.
Similar News
News March 26, 2025
ఇప్పుడు అందాల పోటీలు అవసరమా?: కేటీఆర్

TG: ఈ-కార్ రేసుకు రూ.46 కోట్లు ఖర్చు చేస్తే రాద్ధాంతం చేశారని ఇప్పుడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారని KTR ప్రశ్నించారు. ఈ-రేస్‌తో రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని, మిస్ వరల్డ్ పోటీలతో ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని మంత్రి జూపల్లిని నిలదీశారు. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. వేసవిలో నీటి కష్టాలు తీర్చకుండా అందాల పోటీల నిర్వహణ ఎందుకని దుయ్యబట్టారు.
News March 26, 2025
BREAKING: పంజాబ్ విజయం

గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT ప్లేయర్లు తడబడ్డారు. సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూథర్‌ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించినా చివర్లో చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో GT 20 ఓవర్లలో 232/5 స్కోరుకే పరిమితమైంది.
News March 26, 2025
రాత్రి చపాతి తింటున్నారా?

బరువు తగ్గడానికి చాలామంది రోజూ రాత్రి చపాతి తింటారు. దీని వల్ల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రుళ్లు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చపాతిలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి. దీంతో ఇంకోసారి తినాలని అనిపించదు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా చపాతీలు తినడం సరికాదు.