News April 11, 2025

14,956 ఎకరాల్లో పంట నష్టం!

image

TG: అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.

Similar News

News November 17, 2025

దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

image

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్‌గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.

News November 17, 2025

నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

image

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్‌లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్‌ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్‌ల నుంచి పై ఫొటోను డిజిటల్‌గా క్రాప్ చేశారు. బ్లూ కలర్‌లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్‌లో ఉన్నవి వలయాల నీడలు.

News November 16, 2025

ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.