News September 4, 2024

1,53,278 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

image

TG: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయని, పంట నష్టం 4 లక్షల ఎకరాలకు పెరగొచ్చని అన్నారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు కొత్త పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు.

Similar News

News January 18, 2026

NASA ఆఫర్.. మూడ్రోజులే ఛాన్స్

image

చంద్రుడిని చుట్టి వచ్చేందుకు NASA <<18861755>>ఆర్టెమిస్-2<<>> టెస్ట్ ఫ్లైట్ మిషన్ చేపట్టింది. ఇందులో ప్రజలను భాగం చేసేందుకు ‘సెండ్ యువర్ నేమ్’ క్యాంపైన్ రన్ చేస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను SD కార్డ్‌లో వేసి ఆస్ట్రోనాట్స్‌తో పాటు పంపుతారు. 10 రోజులపాటు మీ పేరు చంద్రుడిని చుట్టొస్తుంది. వారి పేరుతో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారు. JAN 21తో ఈ క్యాంపైన్ ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు <>క్లిక్<<>> చేయండి.

News January 18, 2026

ఆలు లేత, నారు ముదర అవ్వాలి

image

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదరగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.

News January 18, 2026

కాలసర్ప దోష విముక్తికై నేడు ఇలా..

image

జాతకంలో రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే కాలసర్ప దోషం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం, నిరాశ వంటివి ఎదురవుతాయి. చొల్లంగి అమావాస్య పర్వదినం దీనికి సరైన పరిష్కార సమయం. ఓ వెండి నాగుపాము ప్రతిమకు భక్తితో పూజ నిర్వహించి, దానిని ప్రవహించే నదిలో లేదా సముద్ర సంగమ జలాల్లో నిమజ్జనం చేయాలి. ఈ పవిత్ర రోజున ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి, జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.