News March 17, 2024
కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల్లో పంట నష్టం

గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 రైతులకు చెందిన 20,071 ఎకరాల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొంతమేర గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.
Similar News
News March 28, 2026
ఇందూరుపై కవిత కొత్త పార్టీ ప్రభావమెంతా..?

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు వార్తలు సంచలనం రేపుతున్నాయి. సుదీర్ఘ కాలం జిల్లా రాజకీయాలను శాసించిన ఆమె, ఇప్పుడు సొంత కుంపటి పెట్టడం స్థానిక సమీకరణాలను పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని బలమైన నేతలు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఏ వైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే కాకుండా, అసంతృప్త నేతలకు ఈ పార్టీ వేదికయ్యే అవకాశముంది.
News March 27, 2026
NZB: ట్రావెల్స్ బస్సుల్లో వెళ్తున్నారా..?

మార్కాపురం ఘోర ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కామారెడ్డిల నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు నిత్యం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో అధిక శాతం ఫిట్‌నెస్ లేకపోవడం, అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గతంలో ఇందల్వాయి, భిక్నూర్ వద్ద జరిగిన ప్రమాదాలు నిర్లక్ష్యాన్ని చాటిచెప్పాయి.
News March 26, 2026
NZB: అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదు: దినేష్ రెడ్డి

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్రోల్, డీజిల్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని రాష్ట్ర పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల దినేష్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. ఇది పెట్రోల్ పంప్ యజమానులు చేస్తున్న పనిగా కొందరు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ పోయించుకుంటున్నందున అత్యవసర సేవలకు ఆటకం కలుగుతున్నదన్నారు.


