News September 18, 2024
పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.
Similar News
News October 18, 2025
ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లికి ముందే కౌన్సెలింగ్

TG: వివాహబంధాల్లో పెరుగుతున్న ఘర్షణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న సఖీ, వన్ స్టాప్ కేంద్రాల్లో రూ.5 కోట్ల వ్యయంతో వీటిని పెట్టనుంది. ప్రతి సెంటర్లో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్ ఉంటారు. వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వీటిల్లో కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.
News October 18, 2025
రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన

AP: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతం మీదుగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడనుందని, దీంతో రేపట్నుంచి వర్షాలు పెరిగే ఆస్కారముందని చెప్పింది.
News October 18, 2025
నిద్రమత్తులోనే ఉండండి.. టీటీడీపై HC ఆగ్రహం

AP: పరకామణిలో అక్రమాల వ్యవహారంపై ఇటీవల పోలీస్ శాఖపై <<17999947>>విరుచుకుపడ్డ<<>> హైకోర్టు నిన్న టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరికొంత కాలం నిద్రమత్తులోనే ఉండండి అంటూ మండిపడింది. కౌంటర్ ఎందుకు వేయలేదని ఈవోపై ఆగ్రహించింది. తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.