News September 5, 2024
40లు దాటుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పవు

వయసు 40 దాటితే శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తల్ని తీసుకోవాలని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అవి.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. బరువులు ఎత్తడం కంటే జాగింగ్ వంటి కార్డియో మేలు. తగినంత నిద్రపోవాలి. ధూమ, మద్యపానాలకు దూరం కావాలి. పోషకాహారం తీసుకోవాలి. నూనె వంటలకు, తీపికి వీలైనంత దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండేలా ధ్యానం, యోగా వంటివాటిపై దృష్టి సారించాలి.
Similar News
News January 28, 2026
గెలుపు గుర్రాలపై గులాబీ గురి

TG: 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈనెల 30తో ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో గెలిచేవారినే పార్టీ అభ్యర్థులుగా నిలపాలని BRS నిర్ణయించింది. అలాంటి వారిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది నాయకులకు అప్పగించింది. ఎంపికతో పాటు పార్టీ గెలుపు వ్యూహాలనూ అమలు చేయాలని వారిని ఆదేశించింది. అధికార INC నేతల కదలికలను గమనిస్తూ అధిష్ఠానాన్ని అప్రమత్తం చేయాలని సూచించింది.
News January 28, 2026
అపార్ట్మెంట్ బాల్కనీలో మొక్కలు పెంచుతున్నారా?

అపార్ట్మెంట్ బాల్కనీలో పెంచే మొక్కలు ఇంటి అందంతో పాటు వాస్తు శ్రేయస్సును కూడా పెంచుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరిస్తున్నారు. తులసి, బిల్వం, పసుపు, సువాసనలు వెదజల్లే గులాబీ, మల్లె, జాజి మొక్కలు నాటాలంటున్నారు. ‘ఇవి ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఎంతో మేలు చేస్తాయి. మనీప్లాంట్, తమలపాకు తీగలను కింది నుంచి పైకి పాకేలా చేస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 28, 2026
RTCలో 40 కోట్ల మంది ఉచిత ప్రయాణం: రాంప్రసాద్ రెడ్డి

AP: ‘స్త్రీ శక్తి’లో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు, ట్రాన్స్జెండర్లకు ఎంతో మేలు చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ‘వారి జీవితాల్లో ఇదో గొప్ప మార్పు. ఇప్పటివరకు వారు 40 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. మహిళా ప్రయాణికులు 40% నుంచి 63.4%కి పెరిగారు. డిమాండ్కు అనుగుణంగా 1,413 అదనపు ట్రిప్పులు, 64,647 అదనపు KM ఆపరేట్ చేస్తున్నాం. సబ్సిడీగా RTCకి ₹1,388 కోట్లు ఇచ్చాం’ అని చెప్పారు.


