News December 31, 2024
శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగగా, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కౌంటర్ల సంఖ్యను పెంచకపోవడంతో నిరీక్షణ తప్పలేదని భక్తులు వాపోయారు.
Similar News
News November 27, 2025
పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 27, 2025
భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.
News November 27, 2025
అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.


