News April 5, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.
Similar News
News December 19, 2025
మద్దతు ధరతో కందులు, మినుములు, పెసర కొనుగోలు

AP: రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతు ధరపై(ఖరీఫ్ 2025-26) 1,16,690 మె.టన్నుల కందులు, 28,440 మె.టన్నుల మినుములు, 903 మె.టన్నుల పెసర కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లేఖ రాశారు. దీంతో క్వింటా కందులకు దాదాపు రూ.8000, మినుములకు రూ.8,110, పెసరకు రూ.8,768 అందనుంది.
News December 19, 2025
మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ. అయితే దీని వెనుక కారణాన్ని గుర్తించారు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు. అల్జీమర్స్ పేషెంట్స్ రక్తంలోని లిపిడ్స్ను విశ్లేషించగా.. అల్జీమర్స్ ఉన్న మహిళల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న లిపిడ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి మహిళలు ఒమేగా 3 కొవ్వులు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని లేదా సప్లిమెంట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 19, 2025
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఫుట్బాల్ స్టార్!

స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ‘Fast X: Part 2’లో ఆయన కనిపించనున్నారు. రొనాల్డోకు స్వాగతం పలుకుతూ నటుడు టైరెస్ గిబ్సన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఫాస్ట్ ఫ్యామిలీ’లోకి వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.


