News July 29, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకోగా.. 25,894 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు లభించింది.
Similar News
News November 26, 2025
సిద్దిపేట: కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవం

సిద్దిపేట జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై, కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం ప్రాధాన్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
News November 26, 2025
పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.
News November 26, 2025
నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.


