News March 1, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులను నేరుగా క్యూలైన్లలోకి పంపుతుండటంతో, ఉ.7గంటల వరకు కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉ.8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇకపై భక్తులను కంపార్ట్మెంట్లలోకి పంపనున్నారు. వారు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 8గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న 52,731 మంది దర్శించుకోగా 17,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చింది.
Similar News
News March 1, 2025
పచ్చబొట్లతో HIV, హెపటైటిస్ ముప్పు!

పచ్చబొట్లు వేసేందుకు వాడుతున్న ఇంక్, అపరిశుభ్రత విధానాలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. నాసిరకం రసాయనాలు వాడి వేస్తున్న టాటూలలో చర్మ క్యాన్సర్ వస్తున్నట్లు నిర్ధారించింది. అలాగే రోడ్డు పక్కన శుభ్రత లేకుండా, సూది మార్చకుండా పచ్చబొట్టు వేస్తుండటంతో HIV, హెపటైటిస్ సోకుతున్నట్లు వైద్యశాఖ తెలిపింది. పచ్చబొట్లపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ ప్రభుత్వం కోరింది.
News March 1, 2025
తగ్గేదే లే అంటోన్న ‘లక్కీ భాస్కర్’

థియేటర్ ఆడియన్స్ను మెప్పించిన దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. మూవీలోని భాస్కర్ పాత్రకు ఫ్యామిలీ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. గతేడాది నవంబర్ 28న ‘నెట్ఫ్లిక్స్’లో రిలీజ్ కాగా.. అత్యధిక వ్యూస్(19.4M) సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్న (17.3M), గుంటూరుకారం (16.6M), సలార్ (15.4M), దేవర (12M), కల్కి(10.3M), సరిపోదా శనివారం (9.5M) ఉన్నాయి.
News March 1, 2025
80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.