News October 12, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Similar News
News October 12, 2025
దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
News October 12, 2025
ఆ ఒక్క తప్పు వల్ల ఇందిర బలయ్యారు: చిదంబరం

‘ఆపరేషన్ బ్లూస్టార్’(1984)లో జరిగిన తప్పు వల్ల మాజీ PM ఇందిర తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ‘మిలిటరీ ఆఫీసర్లను అగౌరవపరచాలని కాదు కానీ.. గోల్డెన్ టెంపుల్‌ను స్వాధీనం చేసుకునేందుకు అది సరైన మార్గం కాదు. ఆర్మీని దూరంగా ఉంచి టెంపుల్‌ను ఎలా అధీనంలోకి తెచ్చుకోవాలో మేం తర్వాత చూపించాం. Op Blue Star అనేది ఉమ్మడి నిర్ణయం. ఇందిరనే బ్లేమ్ చేయలేం’ అని అన్నారు.
News October 12, 2025
మోదీకి ట్రంప్ ఆహ్వానం

రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ట్రంప్ మోదీని ఆహ్వానించారు. అటు ఈజిప్టు అధ్యక్షుడు కూడా ఆయనను ఆహ్వానించారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఈ ఒప్పందంలో చర్చించనున్నట్లు సమాచారం. కాగా మోదీ హాజరుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.