News December 20, 2024
తాజ్‌మహల్‌కు తగ్గి, అయోధ్య రామాలయానికి పెరిగిన రద్దీ!
ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు పర్యాటకులకు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్‌మహల్ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.
Similar News
News December 21, 2024
ఆ జాబితాలో అత్యధికులు గుజరాతీలే
<<14937075>>అమెరికా పౌరసత్వం<<>> పొందుతున్న వారిలో అత్యధికులు గుజరాతీలు ఉన్నట్టు US Immigration అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో భారతీయలు, ముఖ్యంగా గుజరాతీలు అమెరికాకు శరణార్థిగా వెళ్తున్నారు. జాతి, మతం, రాజకీయ సిద్ధాంతాల వల్ల స్వదేశంలో హింస ఎదుర్కొంటున్న శరణార్థులుగా అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం పత్రాలు లేకపోయినా పనిలో చేరి పౌరసత్వం పొందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
News December 21, 2024
శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..
శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. చలికాలంలో బాదం, కాజు, వాల్నట్స్, ఖర్జూరాలు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెయ్యి, తేనె శరీరంలో వేడి పుట్టిస్తాయి. జొన్నలు, రాగులు తీసుకోవడం మంచిది. బెల్లం నువ్వుల లడ్డూ, పసుపు, గుడ్లు, చికెన్ తీసుకుంటే త్వరగా జీర్ణం కాక శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా ఉంటుంది.
News December 20, 2024
పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!
పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువులపై దాడులు అధికంగా జరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువులపై 112 దాడి ఘటనలు జరగ్గా, బంగ్లాలో 2,200 ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిన తరువాత దాడులు పెరిగినట్టు వెల్లడించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.